DBN TELUGU:-
- బెల్లంపల్లి పురవీదుల్లో ఓటుచైతన్యంపై నినదించిన విద్యార్ధులు.
- ఓటు హక్కుపై చైతన్య కల్పించిన బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ.
14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ బెల్లంపల్లి లో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హుమానిటీస్ విభాగం ఆద్వర్యంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రధాన గేటు వద్ద ఈ ర్యాలీని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అనీ దానిని సరైన రీతిలో నిర్భయంగా ఉపయోగించేలా విద్యార్ధులు తమ తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ చిత్ర పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఓటరు ప్రతిజ్ణ చేసి కళాశాల ప్రధాన గేటు వద్ద నుండి ర్యాలీని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు జండా ఊపి ప్రారంభించారు. బెల్లంపల్లి బస్తీ,మార్కెట్ రోడ్, మీదుగా పాత బస్టాండ్, కాంటా ఏరియా, జియం ఆఫీస్ మీదుగా ఓటు చైతన్య నినాదాలతో సాగింది. కాంటా చౌరస్తాలో ర్యాలీని ఉద్దేశించి బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, ఎమ్మారో సుధాకర్ లు మాట్లాడారు.... ఓటు అనే ఆయుదాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చునన్నారు. అదే విధంగా బెల్లంపల్లి ఎంపిడిఓ రాజేంధర్, ఎం ఈఓ మహేశ్వర రెడ్డి, మున్సిపాల్ కమీషనర్ బుజంగరావు తదితరులు కాంటా చౌరస్తాలో యువతనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్,జెవిపి కొక్కుల రాజేశ్వర్,హుమానిటీస్ విభాగం అద్యక్షులు శ్యాంసుంధర్ రాజు, ముడిమడుగుల మల్లిఖార్జున్,ఆకెనేపల్లి రాజేష్,కోటారి రాజేశం,పిన్నింటి కిరణ్, సింగరావ్ స్రవంతి,ప్రమోద్ కుమార్,వామన్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


